Share News

తిరిగొచ్చిన సాల్ట్.. వెంకటేశ్ అయ్యర్‌ను కాదు అతడిని తప్పించండి: సెహ్వాగ్

ABN , Publish Date - May 23 , 2026 | 04:04 PM

ఆర్సీబీ ఓపెనర్ సాల్ట్ ఫిట్‌నెస్ సాధించడంతో జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వెంకటేశ్ అయ్యర్‌ను తప్పిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీకి పలు కీలక సూచనలు చేశాడు.

తిరిగొచ్చిన సాల్ట్.. వెంకటేశ్ అయ్యర్‌ను కాదు అతడిని తప్పించండి: సెహ్వాగ్
Virender Sehwag

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. అయితే గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చేరాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సాల్ట్ ఆడకపోయినా.. ప్లే ఆఫ్స్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. సాల్ట్ గైర్హాజరీలో బెథెల్ ఓపెనర్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఎస్ఆర్‌హెచ్‌పై వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా దింపారు. సాల్ట్ రావడంతో ఆర్సీబీకి జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన వెంకటేశ్ అయ్యర్‌ను తప్పిస్తారా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఆర్సీబీకి పలు కీలక సూచనలు చేశాడు.


‘సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఓడినా ఆర్సీబీ బ్యాటింగ్‌లో కొన్ని సానుకూల అంశాలు కనిపించాయి. ముఖ్యంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న వెంకటేశ్ అయ్యర్.. అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించిన ఫిల్ సాల్ట్ జట్టులోకి వస్తే.. వెంకటేశ్ అయ్యర్‌ను కాకుండా మరో ప్లేయర్‌ను తప్పించాలి. వెంకటేశ్ అయ్యర్ టాపార్డర్‌లో ఆడినప్పుడే తన అత్యుత్తమ ఆటను కనబరుస్తాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై 73 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఎస్ఆర్‌హెచ్‌పై ఓపెనర్‌గా వచ్చి 19 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఫిల్ సాల్డ్ తిరిగి ఫిట్‌నెస్ సాధించడంతో ఆర్సీబీకి జట్టు ఎంపిక తలనొప్పిగా మారింది. ఈ విషయంలో మాత్రం మాకు స్పష్టమైన అభిప్రాయం ఉంది. వెంకటేశ్ అయ్యర్‌ను మాత్రం జట్టు నుంచి తప్పించే ప్రయత్నాలు చేయొద్దు. అతడి అవసరం ఇప్పుడు జట్టుకు ఉంది. సాల్ట్ జట్టులోకి వస్తే జితేశ్ శర్మను తప్పించండి. ప్రస్తుతం జితేశ్ ఫామ్‌లో లేడు. ఇక కీపింగ్ విషయానికొస్తే.. సాల్ట్ కూడా వికెట్ కీపర్ కాబట్టి ఆర్సీబీకి ఇబ్బంది ఉండదు’ అని సెహ్వాగ్ సూచించాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!

షేక్‌హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్

Updated Date - May 23 , 2026 | 04:04 PM