Share News

సచిన్ తనయుడి వివాహానికి హాజరైన నారా లోకేశ్, బ్రాహ్మణి

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:32 PM

టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ దంపతులు హాజరయ్యారు.

సచిన్ తనయుడి వివాహానికి హాజరైన నారా లోకేశ్, బ్రాహ్మణి
Nara Lokesh, Brahmani in Arjun Tendulkar Wedding Event

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. వీరిని సచిన్ టెండూల్కర్ కుటుంబం సాదరంగా స్వాగతించింది. అనంతరం.. ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో లోకేశ్, బ్రాహ్మణిలు మాట్లాడారు. కాగా.. ఈ వివాహ వేడుకలో పాల్గొనడం కోసం గురువారం ఉదయం ముంబైకి బయల్దేరి వెళ్లారు లోకేశ్ దంపతులు.


ఈ సందర్భంగా నారా లోకేశ్ దంపతులు నవ వధూవరులైన అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌లను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు కలిసి ఈ వేడుకను మరింత వైభవంగా మార్చారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అర్జున్ - సానియాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో అర్జున్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితురాలు, బిజినెస్‌మేన్ సానియా చందోక్‌ను వివాహం చేసుకున్నాడు. కాగా.. అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.


ఇవీ చదవండి:

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

మరోసారి ఉదారతను చాటుకున్న సోనూసూద్.. ఆ ప్రయాణికులకు భరోసా

Updated Date - Mar 05 , 2026 | 05:36 PM