Share News

15 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా కలిపింది.. బంగ్లా నుంచి ఇంటికి చేరిన యువకుడు..

ABN , Publish Date - May 24 , 2026 | 10:04 AM

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన నజీముల్ అనే వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. చిన్న వయసులోనే పొరపాటున బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోయిన అతడు, ఎన్నో కష్టాల తర్వాత చివరకు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

15 ఏళ్ల తర్వాత సోషల్ మీడియా కలిపింది.. బంగ్లా నుంచి ఇంటికి చేరిన యువకుడు..
Nazimul returns home

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన నజీముల్ అనే వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. చిన్న వయసులోనే పొరపాటున బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోయిన అతడు, ఎన్నో కష్టాల తర్వాత చివరకు స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సోషల్ మీడియా కారణంగానే ఆ యువకుడు తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకోగలిగాడు (Nazimul returns home).


నజీముల్ చిన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి తప్పిపోయి సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి కోసం తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశారు. కుమారుడు తిరిగి వస్తాడనే ఆశతో ప్రతి రోజు ఎదురుచూసేవారు. ఇక, ఆశలు కోల్పోయిన దశలో ఏడాది కిందట సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో నజీముల్ మొహాన్ని అతడి తండ్రి చూశారు. దీంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ కొడుకు బంగ్లాదేశ్‌లో ఉన్నట్టు తెలుసుకున్నారు (Bangladesh India border story).


తమ కొడుకును బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రప్పించాల్సిందిగా కోరుతూ స్థానిక ఎంపీ ఇషాఖాన్ చౌధరిని ఆశ్రయించారు (Malda family reunion). ఆ తర్వాత ఇషాఖాన్ ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. చివరకు గురువారం నాడు నజీముల్ తిరిగి తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కుమారుడిని చూసిన తల్లిదండ్రులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.


ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..


ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 24 , 2026 | 10:23 AM