Share News

కూలర్‌ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర ప్రమాదం తప్పదు..

ABN , Publish Date - May 24 , 2026 | 09:14 AM

వేసవిలో చాలా మంది ఎయిర్ కూలర్లు ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇటీవల కూలర్లు పేలిపోవడం లేదా మంటలు చెలరేగడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

కూలర్‌ ఎక్కువగా వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర ప్రమాదం తప్పదు..
air cooler safety tips

వేసవిలో చాలా మంది ఎయిర్ కూలర్లు ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇటీవల కూలర్లు పేలిపోవడం లేదా మంటలు చెలరేగడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. సాధారణంగా కూలర్‌లో ఉండే ఎలక్ట్రిక్ భాగాల్లో లోపాలు, అధిక వినియోగం, నిర్లక్ష్యం, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. (Air cooler mistakes).


చాలా మంది ఎయిర్ కూలర్‌లో నీరు ఉందో, లేదో సరిగ్గా చెక్ చేసుకోరు. కూలర్‌లో నీరు అయిపోయినా సరే గమనించకుండా గంటల తరబడి నడుపుతుంటారు. నీరు లేనప్పుడు కూలర్ లోపల మోటార్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మోటార్ విపరీతంగా వేడెక్కి కాలిపోవడమే కాకుండా ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం ఉంది (Air cooler safety tips).

cooler2.jpg


ఏసీతో తరహాలో కూలర్‌ను ఎక్కువ గంటల పాటు వినియోగించకూడదు. చాలా మంది కూలర్లను వరుసగా 10 నుంచి 12 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వినియోగిస్తుంటారు. కూలర్ మోటార్‌కు తగినంత విశ్రాంతి దొరకనప్పుడు, అది వేడెక్కి లోపల ఉండే వైరింగ్ కరిగిపోతుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదాలు సంభవిస్తాయి (Summer cooling tips).


కూలర్‌కు ఎల్లప్పుడూ తగినంత వెంటిలేషన్ ఉండాలి. గదిలో కిటికీ దగ్గర లేదా బయటి తాజా గాలి లోపలికి వచ్చే ప్రదేశంలో ఉంచాలి. పూర్తిగా మూసివేసిన చిన్న గదిలో కూలర్ పెడితే, గదిలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల కూలర్ బాడీ, వైరింగ్‌పై నీటి బిందువులు చేరి షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది (Air cooler health risks).

cooler3.jpg


కూలర్ లోపల వైరింగ్ పాతదైనా లేదా ఎలుకలు కొరికేసినా కూడా విద్యుత్ లీకేజీ జరిగి ప్రమాదాలు జరుగుతాయి. కూలర్‌లో నీరు, విద్యుత్ రెండూ కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది (Cooler electric safety).


ఒకే ప్లగ్ బోర్డుకు ఫ్రిజ్, టీవీ, కూలర్ వంటి పరికరాలు కలిపితే ఓవర్‌లోడ్ అవుతుంది. దీంతో వైర్లు వేడెక్కి ప్రమాదం జరగవచ్చు. అలాగే మోటార్ దగ్గర దుమ్ము ఎక్కువగా పేరుకుంటే వేడి బయటకు వెళ్లదు. దీని వల్ల మోటార్ ఓవర్ హీట్ అవుతుంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..


ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 24 , 2026 | 09:42 AM