టెహ్రాన్‌కు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..
ABN , Publish Date - May 23 , 2026 | 02:30 PM
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో సమావేశమయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ శుక్రవారం అర్ధరాత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చితో సమావేశమయ్యారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్థాన్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోంది (Asim Munir meeting with Abbas Araghchi).
అమెరికా అభ్యర్థన మేరకు మునీర్ టెహ్రాన్ పర్యటన చేపట్టి, శాంతి ఒప్పందం సాధ్యాసాధ్యాలపై ఇరాన్ నాయకత్వంతో చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో కూడా శాంతి చర్చల గురించి కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కొంత పురోగతి ఉందని పేర్కొన్నారు. అవసరమైతే కొత్త సైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది (Iran US conflict).
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఏ క్షణంలోనైనా ప్రకటన రావొచ్చని వార్తలు వస్తున్నాయి (Pakistan Iran talks). అలాగే ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌తో పాటు కీలక అధికారులతో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ వార్తలనూ చదవండి:
టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్
ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర? ఇరాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది అరెస్టు..