రాజ్యసభ సీటు అమ్ముకున్నారు.. ఆప్‌పై హర్భజన్ సంచలన ఆరోపణలు..
ABN , Publish Date - May 23 , 2026 | 02:54 PM
టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో రాజ్యసభ సీటు అమ్ముకుందని ఆరోపణలు చేశారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎంపికైన హర్భజన్ ఇటీవల మరికొందరితో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో రాజ్యసభ సీటు అమ్ముకుందని ఆరోపణలు చేశారు. ఆప్ నుంచి రాజ్యసభకు ఎంపికైన హర్భజన్ ఇటీవల మరికొందరితో కలిసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హర్భజన్ బీజేపీలో చేరడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి (Harbhajan Singh AAP controversy).
'ఆప్ నుంచి వచ్చిన రాజ్యసభ సీటుకు ఎందుకు రాజీనామా చేయలేదు. మీ మనస్సాక్షికి ఎంత వెలకట్టి బీజేపీలో చేరారు' అని హర్భజన్‌ను ఒక నెటిజన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు హర్భజన్ తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పారు. 'సమయం వచ్చినపుడు అందరి ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను. నేను ఎవరి గురించీ తప్పుగా మాట్లాడలేదు. విమర్శలు చేయలేదు. నన్ను ద్రోహి అనే ముందు మీ పార్టీ నేతలు రాజ్యసభ సీటును ఎంతకు అమ్ముకున్నారో అడగండి' అని పేర్కొన్నారు (Rajya Sabha seat allegation).
'పంజాబ్‌ను దోచుకోవడానికి మంత్రులు, అధికారులు ప్రజలను ఎలా మోసం చేశారో నేను చెబుతాను (AAP sold RS seat). వారు పంజాబ్‌ను పూర్తిగా నాశనం చేశారు. మీ నాయకుడికి (కేజ్రీవాల్) రాష్ట్రంపై ఒక శాతం ప్రేమైనా ఉంటే బాగుండేది' అని హర్భజన్ అన్నారు. కాగా, హర్భజన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఆప్‌లో రాజ్యసభ సీటును అమ్మిన వారి వివరాలను బయటపెట్టాలని డమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్
ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర? ఇరాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది అరెస్టు..