ఐపీఎల్‌లో కొత్త చరిత్ర.. ఆ నాలుగింట్లో ఏ జట్టు గెలిచినా..!
ABN , Publish Date - May 26 , 2026 | 12:12 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరిన నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండోది కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కీలక దశకు చేరుకుంది. నేటి నుంచి ప్లే ఆఫ్స్ సమరం ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్.. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. నేడు ధర్మశాల వేదికగా ఆర్సీబీ-గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. అయితే ఈ సీజన్ ప్లే ఆఫ్స్‌లో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఈ నాలుగు జట్లలో ఏ టీమ్ టైటిల్ గెలిచినా.. దానికి అది రెండో విజయం కానుంది.
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజేతగా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. ఈ సీజన్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ 2026లోనూ గెలిస్తే.. ఆ జట్టు రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుంది.
గుజరాత్ టైటాన్స్ జట్టు 2022లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. జీటీకి అదే తొలి సీజన్ కావడం విశేషం. హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో కప్పును ముద్దాడి గుజరాత్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న జీటీ.. ఈ సీజన్‌లోనూ గెలిస్తే.. అది రెండో టైటిల్ అవుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో కప్పును ముద్దాడింది. ఈ సీజన్‌లో మూడో స్థానంలో ఉన్న ఎస్ఆర్‌హెచ్.. కప్పు గెలిస్తే అది రెండోసారి అవుతుంది.
ఐపీఎల్ ప్రారంభించిన తొలి ఏడాది రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలిచింది. 2008లో షేన్ వార్న్ సారథ్యంలో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు మళ్లీ కప్పు గెలవలేదు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ఆర్ఆర్.. ఈసారి ట్రోఫీ గెలిస్తే అది రెండోసారి అవుతుంది.
ఇవి కూడా చదవండి:
అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన
పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్