ఇన్‌స్టాలో పోస్టులు డిలీట్ చేసిన అర్ష్‌దీప్ సింగ్!
ABN , Publish Date - May 26 , 2026 | 11:19 AM
ఐపీఎల్ 2026 నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించిన తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అనేక పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ అనూహ్యంగా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలో పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు సంబంధించిన ఓ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అతడు.. తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026 నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించిన తర్వాత.. ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ష్‌దీప్ సింగ్ అనేక పోస్టులు తొలగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడి ఖాతాలో 44 పోస్టులు మాత్రమే ఉన్నాయి. విరాట్ కోహ్లీతో చేసిన రీల్ కూడా అతడి ప్రొఫైల్‌లో కనపడకపోవడంతో.. అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌తో చేసిన ఆ రీల్ దాదాపు 1.5 కోట్లకు పైగా వ్యూస్ సాధించింది.

పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు సోషల్ మీడియా వినియోగంపై ఫ్రాంచైజీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. జట్టు ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలు ఇకపై ఫ్రాంచైజీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే రూపొందించి విడుదల చేయాలనే సూచనలు వచ్చినట్లు సమాచారం. దీంతో అర్ష్‌దీప్ పోస్టుల తొలగింపునకు దీనికి సంబంధం ఉందా? అన్న చర్చ కూడా సాగుతోంది.
అయితే, లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అనంతరం.. అర్ష్‌దీప్ సింగ్ ఓ రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో పంజాబ్ స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్.. చేతులు అడ్డం పెట్టుకుని ఈ సిగరేట్ వేప్ చేస్తూ కనిపించాడు. దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన అనంతరం.. ఐపీఎల్ 2026 ముగిసే వరకు వ్లాగింగ్ ఆపేయాలని బీసీసీఐ అర్ష్‌దీప్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అర్ష్‌సింగ్ ఇన్‌స్టా పోస్టులు డిలీట్ చేయడం నెట్టింట కొత్త చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి:
అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. ట్రోల్స్‌పై శ్రేయస్ సోదరి ఆవేదన
పద్మశ్రీ అందుకున్న టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్