యురేనియంను అమెరికాకు అప్పగించాలి లేదా నాశనం చేయాలి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..
ABN , Publish Date - May 26 , 2026 | 12:42 PM
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలకాంశంగా మారింది. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా, అందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలకాంశంగా మారింది. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా, అందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలని, లేదంటే అంతర్జాతీయ పర్యవేక్షణలో పూర్తిగా ధ్వంసం చేయాలని ట్రంప్ స్పష్టం చేశారు (Iran Enriched Uranium).
ఇరాన్ అణు కార్యక్రమం ప్రపంచ దేశాలకు ముప్పుగా మారే అవకాశముందని ట్రంప్ హెచ్చరించారు. అధిక శుద్ధి చేసిన యురేనియం ద్వారా అణ్వాయుధాల తయారీ సాధ్యమవుతుందని, అందుకే దీనిపై కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైతే మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చెప్పారు (US Iran Nuclear Talks).
కాగా, తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి (Iran Nuclear Program). తాము ఆణ్వాయుధం కోసం వెంపర్లాడడం లేదని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాజాగా, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..
నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..