Share News

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..

ABN , Publish Date - May 26 , 2026 | 10:43 AM

డ్రగ్స్ కేసులో పంజాబీ సింగర్ హర్బీర్ సింగ్ సోహాల్ అరెస్టయ్యాడు. కారులో హెరాయిన్ తరలిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. కారు నుంచి 5.1 కేజీల హెరాయిన్, 1.50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

డబ్బు కోసం డ్రగ్స్ దందా.. సింగర్ కారులో 5 కేజీల హెరాయిన్ లభ్యం..
Harbeer Sohal arrest

ఇంటర్‌నెట్ డెస్క్: డ్రగ్స్ కేసులో పంజాబీ సింగర్ హర్బీర్ సింగ్ సోహాల్ అరెస్టయ్యాడు. కారులో హెరాయిన్ తరలిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. కారు నుంచి 5.1 కేజీల హెరాయిన్, 1.50 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఖన్నా ఎస్ఎస్‌పీ దర్పన్ అహ్లువాలియా తెలిపిన వివరాల మేరకు.. డ్రగ్స్ సప్లై రాకెట్‌లో హర్బీర్ కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడు. హ్యాండ్లర్‌ల ద్వారా ఆస్ట్రేలియా, కెనడా నుంచి వచ్చిన డ్రగ్స్‌ను లోకల్ సప్లయర్స్‌కు చేరవేస్తున్నాడు. మే 7వ తేదీన 22 ఏళ్ల అక్షయ్ కుమార్ అనే వ్యక్తి డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టయ్యాడు.


పోలీసులు అతడి ఇంట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ గుర్తించారు. 301 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా.. లుథియానాలోని షిమ్లపురికి చెందిన విశాల్, సంజీవ్ కుమార్‌ల నుంచి తాను డ్రగ్స్ కొనుగోలు చేశానని చెప్పాడు. పోలీసులు సంజీవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హర్బీర్ సోహాల్ పేరు బయటకు వచ్చింది. హర్బీర్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయి. 2022లో అతడు ఎక్స్‌టార్షన్ రాకెట్‌ కేసులో అరెస్ట్ అయ్యాడు. కొన్ని నెలల పాటు జైలులో ఉన్నాడు. బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్ అయ్యాడు.


ఇవి కూడా చదవండి

మైలవరంలో గాలివాన బీభత్సం.. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే..

ఆర్సీబీ నుంచి తప్పుకోవడం నా నిర్ణయం కాదు: యశ్ దయాల్

Updated Date - May 26 , 2026 | 10:48 AM