Share News

ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి మృతి..

ABN , Publish Date - May 26 , 2026 | 01:07 PM

ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కళహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి మృతి..
Odisha septic tank tragedy

ఒడిశాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కళహండి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ఊపిరాడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కళహండి జిల్లాలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో సెంట్రింగ్ తీయడానికి మేస్త్రి దిగాడు (Odisha septic tank tragedy).


సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి సెంట్రింగ్ తీస్తున్న సమయంలో అది కూలిపోయింది. దీంతో మేస్త్రి అందులో చిక్కుకుపోయాడు. మేస్త్రిని కాపాడేందుకు మరో ఐదుగురు సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. లోపలికి దిగిన ఆ ఐదుగురు కూడా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్థులు వెంటనే స్పందించి మొత్తం ఆరుగురిని వెలికి తీశారు. హాస్పిటల్‌కు తరలించారు (Septic tank deaths).


హాస్పిటల్‌కు తరలించే సమయానికే వారు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు (Odisha village incident). చనిపోయిన వారిలో ముగ్గురు మేస్త్రిలు, ఒక కార్మికుడు, ఇంటి యజమాని, అతడి కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 01:09 PM