UIDAI కీలక నిర్ణయం.. అదిరిపోయే ఫీచర్స్‌తో ఆధార్ కొత్త యాప్..
ABN , Publish Date - May 26 , 2026 | 12:26 PM
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రజలు వినియోగిస్తున్న పాత 'mAadhaar' యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా మరింత భద్రత, గోప్యత, స్మార్ట్ ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రజలు వినియోగిస్తున్న పాత 'mAadhaar' యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా మరింత భద్రత, గోప్యత, స్మార్ట్ ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆధార్ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. 'mAadhaar త్వరలో డిస్కంటిన్యూ అవుతుంది. కొత్త ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వేగవంతమైన సేవలు, స్మార్ట్ ఫీచర్లు పొందండి' అని పేర్కొంది.
కొత్త ఆధార్ యాప్ ప్రత్యేకతలు..
కొత్త యాప్‌ను కేవలం డిజైన్ మార్పులతో మాత్రమే కాకుండా ఆధార్ వినియోగ విధానాన్ని పూర్తిగా మార్చేలా రూపొందించారు. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారం భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
QR ఆధారిత ఆధార్ షేరింగ్..
కొత్త యాప్‌లో 'సెక్యూర్ క్యూఆర్ కోడ్ షేరింగ్' అనే అత్యంత కీలకమైన ఫీచర్‌ని తీసుకొచ్చారు. హోటళ్లు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి చోట్ల ఆధార్ చూపించాల్సి వచ్చినప్పుడు ఇక పూర్తి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైన సమాచారాన్ని మాత్రమే క్యూఆర్ కోడ్ ద్వారా సురక్షితంగా షేర్ చేయవచ్చు.
ఫేస్ అథెంటికేషన్..
ఇప్పటివరకూ ఆధార్ యాక్సెస్ కోసం ప్రధానంగా ఓటీపీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ, కొత్త యాప్‌లో ఓటీపీతోపాటు ఫేస్ అథెంటికేషన్, క్యూఆర్ వెరిఫికేషన్ వంటి అదనపు భద్రతా వ్యవస్థలను ప్రవేశపెట్టారు. దీంతో ఆధార్ దుర్వినియోగం తగ్గుతుందని UIDAI భావిస్తోంది.
యూజర్‌కే పూర్తి నియంత్రణ..
కొత్త ఆధార్ యాప్ ద్వారా వినియోగదారులు తమ ఫింగర్ ప్రింట్, ఫేస్, ఐరిస్ బయోమెట్రిక్ వివరాలను నేరుగా లాక్ చేయడం లేదా నిర్వహించడం చేయవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ లేదా షేర్డ్ డివైస్‌లలో అక్రమ యాక్సెస్‌ను తగ్గించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
కొత్త ఆధార్ యాప్ ఎలా సెటప్ చేయాలి?
1. గూగుల్ ప్లే స్టోర్ లేదా అధికారిక యాప్ స్టోర్ నుంచి ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. యాప్ ఓపెన్ చేసిన తర్వాత భాషను ఎంచుకోవాలి.
3. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
4. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
5. అవసరమైతే ఫేస్ అథెంటికేషన్ వంటి అదనపు వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా డిజిటల్ ఐడెంటిటీ సేవలను మరింత సురక్షితంగా, సులభంగా మార్చేందుకు UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వ్యక్తిగత డేటా రక్షణ, ఆధార్ వినియోగంలో పారదర్శకత, మోసాలను తగ్గించడం లక్ష్యంగా కొత్త యాప్‌ను రూపొందించారు.
ఈ వార్తలు కూడా చదవండి
16వ సారి పెరోల్.. జైలు నుంచి విడుదలైన డేరా బాబా..
త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు చెప్పిన భర్త..