Share News

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు చెప్పిన భర్త..

ABN , Publish Date - May 26 , 2026 | 12:00 PM

త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్‌ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్‌ను విచారించారు.

త్విశాకు బైపోలార్ డిజార్డర్.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు చెప్పిన భర్త..
Twisha Sharma case

ఇంటర్‌నెట్ డెస్క్: నటి త్విశా శర్మ కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. నిన్న (సోమవారం) సీబీఐ అధికారులు భోపాల్ వెళ్లారు. త్విశా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్‌పై ఎఫ్ఐఆర్‌ను రీరిజిస్టర్ చేశారు. దాదాపు 10 గంటల పాటు సీబీఐ అధికారులు సమర్థ్‌ను విచారించారు. విచారణ సందర్భంగా సమర్థ్ ఏం చెప్పాడంటే.. ‘నాకు త్విశాకు మధ్య గొడవలు ఉన్న మాట వాస్తవమే. కానీ, నేను ఆమెను ఎప్పుడూ కొట్టలేదు. తరచుగా మా మధ్య వాగ్వివాదాలు జరిగేవి. మా బంధం విషయంలోనే గొడవలు జరిగేవి. మార్చి వరకు మా బంధం ఎంతో సాఫీగా సాగిపోయింది’ అని అన్నాడు.


అబార్షన్ తర్వాత అంతా మారిపోయింది..

సమర్థ్ సీబీఐ అధికారులతో మాట్లాడుతూ.. ‘నేను తండ్రిని కావాలనుకున్నాను. కానీ, త్విశా పిల్లలు వద్దనుకుంది. అందుకే గర్భం దాల్చిన తర్వాత అబార్షన్ చేయించుకోవడానికి డిసైడ్ అయింది. నేను ఎంత చెప్పినా తను వినలేదు. తన కోసం ఇష్టం లేకపోయినా అబార్షన్‌కు ఒప్పుకున్నాను. ఇద్దరం ఆస్పత్రికి వెళ్లాం. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడటం ద్వారా త్విశాకు అబార్షన్ అయింది’ అని చెప్పాడు. సమర్థ్ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు పోలీసులు మెడికల్ రిపోర్టులు సేకరించే పనిలో పడ్డారు.


వాట్సాప్‌ చాట్స్‌లో మరోలా..

సమర్థ్ తమకు చెప్పిన దానికి.. త్విశా శర్మ వాట్సాప్ మెసేజ్‌లలో ఉన్న దానికి సంబంధం లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వాట్సాప్ చాట్‌లలో.. త్విశా శర్మ గర్భం దాల్చటంపై సమర్థ్ అనుమానం వ్యక్తం చేశాడు. ఆ బిడ్డకు తండ్రి ఎవరని కూడా త్విశాను ప్రశ్నించాడు. అధికారుల ముందు ‘నేను, మా అమ్మ బిడ్డ కావాలనుకున్నాము. కానీ, త్విశా మాత్రం గర్భం దాల్చినప్పటినుంచి మానసిక వేదనకు గురైంది’ అని చెప్పాడు.


త్విశాకు బైపోలార్ డిజార్డర్..

త్విశా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేదని సమర్థ్ సీబీఐ అధికారులకు చెప్పాడు. ఆమె ప్రవర్తన చాలా స్పీడ్‌గా మారిపోయేదని అన్నాడు. సమర్థ్ మాట్లాడుతూ.. ‘ఆమె ప్రవర్తనలో చాలా స్పీడ్‌గా మార్పులు రావటం గుర్తించి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. త్విశా అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్‌తో బాధపడుతోందని డాక్టర్ చెప్పాడు. ఒత్తిడి తగ్గించడానికి డాక్టర్ ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చాడు’ అని చెప్పాడు.


ఇవి కూడా చదవండి

ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు విడుదల

16వ సారి పెరోల్.. జైలు నుంచి విడుదలైన డేరా బాబా..

Updated Date - May 26 , 2026 | 12:28 PM