Home » Aadhaar
మీ సేవ ద్వారా అందించే రాష్ట్ర ప్రభుత్వ సేవలను పొందేందుకు ఆధార్ ధ్రువీకరణ స్వచ్ఛందం మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ ఆధారిత ధృవీకరణ విఫలమైనా, ఆధార్ ఇవ్వడానికి దరఖాస్తుదారు నిరాకరించినా ఎలాంటి ప్రభుత్వ సేవ లేదా ప్రయోజనాన్ని నిరాకరించకూడదని స్పష్టం చేసింది.
మీ ఆధార్‌కు వేరే వాళ్ల మొబైల్ నంబర్ లింక్ చేసి ఉందా? మీ ఆధార్‌కు మీ మొబైల్ నంబర్ లింక్ చేయాలని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండి మీ ఆధార్ లింక్‌డ్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఆధార్‌తో ఆస్తులు అధికారికంగా హాంఫాట్ పేరుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనం సంచలనాలను సృష్టించింది. ఇదేలా సాధ్యమంటూ పాఠకులు ఆశ్చర్యపోయారు.
ప్రతిదానికీ ప్రామాణికమైన ఆధార్‌నే గోల్‌మాల్ చేసి, ఆస్తులు కొట్టేస్తున్న వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆధార్ కార్డులో పేర్లను మార్చి పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్న నయా మోసగాళ్లపై దృష్టి సారించింది. ‘ఆధార్‌తో...అధికారికంగా... ఆస్తులు హాంఫట్!’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం సంచికలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో పెను సంచలనం సృష్టించింది.
‘ఆధార్’ భద్రతనే ప్రశ్నార్థకం చేస్తున్న మోసాలివి! ‘అత్యంత కట్టుదిట్టం, పటిష్ఠం’ అని భావిస్తున్న యూఐడీఏఐ డేటాకే తూట్లు పొడుస్తున్న వైనమిది! అన్నింటికీ ‘ఆధార్’ను ప్రామాణికంగా పరిగణిస్తున్న రోజుల్లో... ఆ ఆధార్‌నే గోల్‌మాల్ చేస్తూ ఆస్తులు కొట్టేస్తున్న బడా మోసాలు బయటపడ్డాయి.
'అపార్' ఐడీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ లేదా అపార్ ఐడీలు లేవనే సాకుతో ఏ విద్యార్థికీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు లేదా మార్క్స్ మెమోలను నిరాకరించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రజలు వినియోగిస్తున్న పాత 'mAadhaar' యాప్‌ను త్వరలో పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి బదులుగా మరింత భద్రత, గోప్యత, స్మార్ట్ ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.
బంగారం కొనుగోళ్లకు సంబంధించి వచ్చే బడ్జెట్‌లో పాన్-ఆధార్ పరిమితి పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న మొత్తంలో నగలు కొన్నా రూ. 2 లక్షల మార్కును దాటేస్తున్నాయి.
మీ మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ ఆధార్‌తో సరిగ్గా లింక్ అయి ఉండటం చాలా ముఖ్యం. ఇది ఓటీపీల ద్వారా ఆధార్ సర్వీసెస్ సులభంగా పొందడానికి సాయపడుతుంది. ఇవి లింక్ లేకపోతే మిస్‌యూజ్ రిస్క్ పెరుగుతుంది. సర్వీసెస్‌లో సమయాభావం పెరుగుతుంది.
వినియోగదారుల సౌలభ్యం కోసం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చింది ఉడాయ్. దీని ద్వారా ఆధార్‌ను భద్రపరచుకోవడంతో పాటు అవసరమైన వివరాలను మాత్రమే షేర్ చేస్కునే వెసులుబాటు ఉంటుంది.