Share News

Revised Aadhaar Update Charges: ఆధార్ అప్‌డేట్ చార్జీలు పెరిగాయి

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:30 PM

భారతదేశంలో 130 కోట్ల మందికి ఆధార్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఈ కార్డులో ఏమైనా పొరపాట్లను లేదా సవరణలు చేసుకోవాలంటే, కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్‌డేట్ చార్జీలు పెంచారు.

Revised Aadhaar Update Charges:  ఆధార్ అప్‌డేట్ చార్జీలు పెరిగాయి
UIDAI has revised Aadhaar update charges

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో 130 కోట్ల మంది పౌరులకు గుర్తింపు కార్డుగా ఆధార్ ఉంది. అయితే, ఈ కార్డులో ఏమైనా పొరపాట్లు లేదా సవరణలు చేసుకోవాలంటే, సదరు సెంటర్లకి వెళ్లి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, తాజాగా ఆయా అప్‌డేట్ చార్జీలు కొంతమేర పెంచారు.

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇటీవల విడుదల చేసిన ఆఫీస్ మెమోరాండమ్ ప్రకారం, అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2028 వరకు ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. ఇవి రిజిస్ట్రార్లు లేదా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందించే సేవలకు సంబంధించినవి. ఇందులో GST కూడా చేర్చబడుతుంది.

ఇప్పటి వరకు ఉన్న చార్జీలతో పోలిస్తే రుసుముల్లో కొన్ని మార్పులు చేశారు. కానీ పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్లు ఉచితంగానే ఉన్నాయి.


కొత్త చార్జీల వివరాలు:

డెమోగ్రాఫిక్ అప్‌డేట్లు (పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, PoA/PoI డాక్యుమెంట్లు): ఒక్కటి లేదా అంతకంటే ఎక్కువ ఫీల్డులకు రూ. 75 (ఆన్‌లైన్ మోడ్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో). 2028-31 మధ్య రూ. 90కు పెరుగుతుంది.

బయోమెట్రిక్ అప్‌డేట్లు (ఫింగర్‌ ప్రింట్, ఐరిస్, ఫోటో; డెమోగ్రాఫిక్‌తో కలిపి): రూ. 125. 2028-31 మధ్య రూ. 150 అవుతుంది.

5 నుంచి 7 ఏళ్లు, 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం.

ఆధార్ సెర్చ్, eKYC (A4 షీట్‌పై కలర్ ప్రింటవుట్‌తో): రూ. 40 (2025-28); రూ. 50 (2028-31).

ఆధార్ జెనరేషన్: 0 నుంచి 5 ఏళ్ల పిల్లలకు, ఇంకా 5 ఏళ్లు పైబడినవారికి ఉచితం.

పూర్తి అప్‌డేట్ (డెమోగ్రాఫిక్ + బయోమెట్రిక్) కోసం సాధారణంగా రూ. 125 చెల్లించాలి. ఎందుకంటే బయోమెట్రిక్ ఫీలో డెమోగ్రాఫిక్ చేర్చబడుతుంది. ఇంటి ఎన్‌రోల్‌మెంట్ సర్వీస్ వృ ద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్నవారికి ఇంటి వద్ద అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే, సాధారణ ఫీకు జోడించి రూ. 700 (GST సహా) చెల్లించాలి.

ఒకే చిరునామాలో ఎక్కువ మంది ఉంటే, మొదటి వ్యక్తికి రూ. 700, మిగతా వారికి ఒక్కొక్కరికి రూ. 350.


అప్‌డేట్ ఎలా చేయాలి?

ఆధార్ అప్‌డేట్‌ను myAadhaar పోర్టల్ (సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్) ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. లేదా సమీప ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ECMP/UC/CELC ఉపయోగించి చేసుకోవచ్చు. (డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి). UIDAI ప్రకారం, ఆధార్‌ను అప్‌డేట్ చేయడం వివిధ ప్రభుత్వ సేవలకు అవసరం.

మరిన్ని వివరాలకు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించండి.


ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 01:37 PM