Stock Market: లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:20 AM
గత ఏడు సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలు మంగళవారం మాత్రం అదిరే లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికి మళ్లీ కిందకు దిగి వచ్చాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఫైనాన్సియల్, మెటల్ రంగాలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి.
గత ఏడు సెషన్లుగా వరుసగా నష్టాలనే చవిచూస్తున్న దేశీయ సూచీలు మంగళవారం మాత్రం అదిరే లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికి మళ్లీ కిందకు దిగి వచ్చాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. ఫైనాన్సియల్, మెటల్ రంగాలు మాత్రం లాభాలను అర్జిస్తున్నాయి. మార్కెట్ మొదలైన సమయంలో మొత్తం 16 రంగాలు లాభాలతో మొదలయ్యాయి. ప్రస్తుతం సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతన్నాయి. (Indian stock market).
సోమవారం ముగింపు (80, 364)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 200 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత మళ్లీ కిందకు దిగజారింది. ప్రస్తుతం ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 80, 449 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 3 పాయింట్ల లాభంతో 24, 638 వద్ద కొనసాగుతోంది (stock market news today).
సెన్సెక్స్‌లో కోఫోర్జ్ లిమిటెడ్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెలివరీ, హిందుస్థాన్ జింక్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). డిక్సన్ టెక్నాలజీస్, ఆర్బీఎల్ బ్యాంక్, కమ్మిన్స్, భారత్ ఫోర్జ్, ఎమ్‌సీఎక్స్ ఇండియా షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 13 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.74గా ఉంది.
ఇవీ చదవండి:
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి