Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
ABN , Publish Date - Sep 27 , 2025 | 05:56 AM
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజూ నష్టపోయింది. తమ దేశంలోకి దిగుమతయ్యే బ్రాండెడ్ ఔషధాలపై వచ్చే నెల 1 నుంచి 100ు సుంకాలు విధించనున్నట్లు అమెరికా....
సెన్సెక్స్ 733 పాయింట్లు పతనం
81,000 దిగువ స్థాయికి సూచీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో రోజూ నష్టపోయింది. తమ దేశంలోకి దిగుమతయ్యే బ్రాండెడ్ ఔషధాలపై వచ్చే నెల 1 నుంచి 100ు సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఫార్మా రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. ట్రంప్ హెచ్1బీ వీసా ఫీజును కూడా భారీగా పెంచిన నేపథ్యంలో ఐటీ రంగ షేర్లలో వరుసగా ఐదో రోజూ అమ్మకాలు కొనసాగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) నిరవధిక అమ్మకాలు మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. దాంతో ప్రామాణిక సూచీలు శుక్రవారం భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 733.22 పాయింట్లు పతనమై 80,426.46 వద్ద ముగిసింది. ఒక దశలో సూచీ 827.27 పాయింట్లు క్షీణించి 80,332.41 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 236.15 పాయింట్లు కోల్పోయి 24,654.70 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్, నిఫ్టీకి మూడు వారాల కనిష్ఠ ముగింపు స్థాయిలివి. ఈ వారంలో గడిచిన 6 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 2,587.50 పాయింట్లు (3.16 శాతం) క్షీణించింది. నిఫ్టీ సైతం 768.9 పాయింట్లు (3ు) పతనమైంది. ఈ ఆరు రోజుల్లో ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.16.34 లక్షల కోట్లు తగ్గి రూ.450.55 లక్షల కోట్లకు (5.08 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
ఐపీఓకు ఆర్వీ ఇంజనీరింగ్ హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ సంస్థ ఆర్వీ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. ఇందుకు అనుమతి కోరుతూ సెబీకి ప్రాథమిక ముసాయిదా పత్రాలు (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.202.5 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్‌కు చెందిన 67.5 లక్షల షేర్లను ఓఎ్‌ఫఎస్ ద్వారా విక్రయించనుంది.
ఫార్మా షేర్ల పతనం
కంపెనీ నష్టం (%)
వోకార్డ్ లిమిటెడ్ 9.40
ఎస్‌ఎంఎస్ ఫార్మా 6.56
ఇండోకో రెమెడీస్ 5.35
సువెన్ లైఫ్ సైన్సెస్ 4.56
జైడస్ లైఫ్‌సైన్సెస్ 4.21
దివీస్ ల్యాబ్స్ 3.53
గ్లెన్‌మార్క్ ఫార్మా 2.99
గ్రాన్యూల్స్ ఇండియా 2.72
నాట్కో ఫార్మా 2.65
సన్ ఫార్మా 2.55
లుపిన్ 2.07
డాక్టర్ రెడ్డీస్ 1.73
సిప్లా 0.72
గ్లాండ్ ఫార్మా 0.58
అరబిందో ఫార్మా 0.57
ఇవి కూడా చదవండి..
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News