ఘనంగా 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం..
ABN , Publish Date - May 26 , 2026 | 01:39 PM
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. అప్నాపన్ పుస్తకాన్ని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
ఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన 'అప్నాపన్: మై ఎక్స్‌పీరియన్స్ విత్ నరేంద్ర మోదీ' పుస్తకావిష్కరణ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగింది. అప్నాపన్ పుస్తకాన్ని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశానికి అప్నాపన్ పుస్తకాన్ని శివరాజ్ సింగ్ అంకితం చేశారు. దేశాభివృద్ధికి నరేంద్ర మోదీ చేస్తున్న కృషి, ఆయనతో తన అనుభవాలను ఈ పుస్తకంలో కేంద్ర మంత్రి పొందుపరిచారు.
పుస్తకావిష్కరణ అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రైతు కుటుంబం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చారు. 17 ఏళ్ల పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశంలో ప్రముఖ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. ఉచిత పథకాలకు నేను వ్యతిరేకం. రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రజలకు విద్య, ఆరోగ్యం అందించాలి. మోదీ అంటే 'మేకింగ్ ఆఫ్ ఇండియా డెవలప్‌మెంట్' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు టీడీపీ ఎంపీలు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి
UIDAI కీలక నిర్ణయం.. అదిరిపోయే ఫీచర్స్‌తో ఆధార్ కొత్త యాప్..
ఈసారి మహానాడు గిన్నిస్ బుక్ లో ఎక్కబోతుంది: పల్లా శ్రీనివాసరావు