రైలు పట్టాలపై అతి.. రైలు ముందు తాపీగా నడస్తూ..
ABN , Publish Date - May 28 , 2026 | 07:56 AM
ఓ వ్యక్తి రైలు పట్టాలపై.. అది కూడా రైలు ముందు తాపీగా నడిచాడు. హారన్ కొడుతున్నా కూడా పక్కకు వెళ్లలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: సాధారణంగా రైలు హారన్ సౌండ్ వినపడగానే గుండెలు ఝల్లుమంటాయి. హారన్ సౌండ్ వినపడగానే భయంతో రైలు పట్టాలకు చాలా దూరంగా పరిగెడతాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలో ఓ వ్యక్తి రైలు పట్టాలపై.. అది కూడా రైలు ముందు తాపీగా నడిచాడు. హారన్ కొడుతున్నా కూడా పక్కకు వెళ్లలేదు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలో ఓ లోకల్ ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే పట్టాలపై ఓ వ్యక్తి నడుస్తూ కనిపించాడు.
లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించాడు. హారన్ కొడుతూ పట్టాలపై నడుస్తున్న వ్యక్తిని పక్కకు తప్పుకోమనట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, ఆ వ్కక్తి ఏమాత్రం పక్కకు వెళ్లలేదు. వెనకాల రైలు వస్తున్నా.. గట్టిగా హారన్ శబ్దం వినిపిస్తున్నా అతడు ఏమాత్రం స్పందించలేదు. ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆశ్చర్యంతో నోర్లు వెళ్లబెట్టి అతడిని చూస్తూ ఉండిపోయారు. కొంతమంది దీన్నంతా తమ ఫోన్‌లలో వీడియోలు సైతం తీశారు. సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఆ రైలు ఎందుకు ఆలస్యం అయిందో ఇప్పుడు అర్థం అవుతోంది’..‘అది బోరివాలి ట్రైన్. ఆ రైలులో నేను కూడా ఉన్నాను’..‘అతడు బాగా తాగినట్లు ఉన్నాడు. లేదంటే అలా ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకుంటాడు’..‘జీవితంలో ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు’..‘నాకు తెలిసి అతడి పేరు రాయల్ ఎన్‌ఫీల్డ్ అయి ఉంటుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. సైనిక స్థావరమే టార్గెట్..
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో సైబర్ మోసం