తాజా పాల పేరుతో ప్యాకెట్ పాల అమ్మకం.. వీడియో వైరల్
ABN , Publish Date - May 29 , 2026 | 06:21 PM
దేశంలో పాలు, కాఫీ, టీలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉదయాన్నే ఆరోగ్యానికి మంచిదని, పిల్లల కోసం ప్యాకెట్ పాల కంటే తాజా పాలు కొనేందుకే చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రజలకు ఉన్న ఈ నమ్మకాన్ని కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో కొంతమంది కేటుగాళ్లు డబ్బు సంపాదించడం కోసం ఎన్నో రకాల మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రజల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. చాలా మంది ప్యాకెట్ పాల కన్నా.. ఇంటికి తీసుకువచ్చే తాజా పాలు అంటే ఇష్టపడతారు. ఆ పాలు స్వచ్ఛమైన ఆవు లేదా గేదె పాలు అయి ఉంటాయని, ఎక్కువలో ఎక్కువ కొద్దిగా నీళ్లు కలిపినా పెద్ద సమస్య కాదని భావిస్తుంటారు. కానీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక కొందరు షాక్‌కు గురవుతున్నారు.
ఈ వీడియోలో.. ఒక పాలవ్యాపారి మరో వ్యక్తి దగ్గరి నుంచి ప్యాక్ చేసిన పాలను తీసుకుంటూ కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ప్యాకెట్‌ను చించి, అందులోని పాలను క్యాన్‌లో పోస్తున్నాడు. తర్వాత ఆ పాలను ఊళ్లో తిరుగుతూ.. తాజా పాలు అంటూ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్యాక్ చేసిన పాలకంటే నేరుగా పాలవాడు ఇచ్చే పాలను ఎక్కువగా నమ్ముతుంటారు ప్రజలు. అవి తాజాగా ఉంటాయని, ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా వస్తాయని భావిస్తారు. అయితే ఈ వీడియో ఆ నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.
ఈ వీడియో @raavan_india అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇంతకాలం మనం తీసుకున్నవి నిజంగా స్వచ్ఛమైన పాలేనా?’ అంటూ కామెంట్ చేయగా, ‘ఇలాంటి వారిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలి’అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, కొంతమంది మాత్రం ఈ ఒక్క వీడియో ఆధారంగా అందరు పాలవాళ్లను తప్పుపట్టకూడదు అని అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనుమతి లేకున్నా.. అడ్మిషన్లు..!
Joint CSIR UGC-NET జూన్ 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
For More Education News And Telugu News