'మహా' విషాదం.. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి
ABN , Publish Date - May 29 , 2026 | 05:36 PM
మహారాష్ట్ర పుణె జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పింప్రి-చించ్వాడ్ పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి పదకొండి మంది మృతిచెందగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కల్తీ మద్యం విషాదం చోటుచేసుకుంది. పుణె, పింప్రి-చింఛ్వాడ్ జంట నగరాల్లో ఇప్పటివరకు 11 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. లోకల్ మద్యం సేవించిన అనంతరం బాధితులు ఒక్కసారిగా వాంతులు, కంటిచూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే వారిని సమీప ఆస్పత్రులకు తరలించినప్పటికీ పలువురు చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాల్లో పాల్గొన్నవారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు పింప్రి ఏసీపీ సచిన్ హిరే వెల్లడించారు. వీరిద్దరూ మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
డంపింగ్ యార్డుల రహితంగా ఏపీని మారుస్తాం: మంత్రి నారాయణ..
సీఎంఆర్‌ఎఫ్ నిబంధనలు కఠినతరం..