Share News

Joint CSIR UGC-NET జూన్ 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..

ABN , Publish Date - May 28 , 2026 | 05:20 PM

దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఎన్టీఏ ప్రారంభించింది.

Joint CSIR UGC-NET జూన్ 2026 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..

దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పరిశోధనలు చేయాలనుకునే అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ఎన్టీఏ ప్రారంభించింది. మే 27న అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల ద్వారా భారతీయ విద్యార్థులకు జూనియర్ రీసెర్చ్ ఫెల్లోషిప్(జేఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం, పీహెచ్‌డీకి అవసరమైన ప్రవేశాలకు అర్హతను నిర్ణయిస్తారు.


దరఖాస్తుల స్వీకరణ.. ఆఖరు తేదీ..

మే 27వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులు స్వీకరించేందుకు ఆఖరు తేదీ జూన్ 19 రాత్రి 11:50 గంటలు.

పరీక్ష నిర్వహించే తేదీలు..

ఈ ఏడాది జులై 17, 18 తేదీల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేసెడ్‌ టెస్ట్(సీబీటీ) మోడ్‌లో నిర్వహిస్తారు. రెండు రోజుల్లో రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.


ఫీజు చెల్లింపు చివరి తేదీ..

2026 జూన్ 20 (రాత్రి 11:50 గంటల వరకు) క్రెడిట్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తులో సవరణలకు అవకాశం..

2026 జూన్ 22వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు..

పరీక్ష నగరాల ప్రకటన, హాల్ టికెట్ల డౌన్ లోడ్, ఫలితాల తేదీ అధికారిక వెబ్ సైట్‌లో తెలియజేస్తారు.


పరీక్షా విధానం..

మొత్తం 180 నిమిషాలు (3 గంటలు)

పరీక్షా సమయం..

  • షిఫ్ట్ 1: ఉదయం 9:00 గంటల నుంచి 12:00 గంటల వరకు

  • షిఫ్ట్ 2: మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు


భాష: ఇంగ్లీషు, హిందీలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

అధికారిక వెబ్ సైట్: https://csirnet.nta.nic.in/


ఎలా దరఖాస్తు చేసుకోవాలి..

స్టెప్ 1: అధికారిక వెబ్ సైట్ https://csirnet.nta.nic.in/లోకి వెళ్లాలి.

స్టెప్ 2: జాయింట్ సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూన్ 2026 రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్ చేయాలి.


స్టెప్ 3: అందులో మీరు వినియోగిస్తున్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.

స్టెప్ 4: ఆ దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి.


స్టెప్ 5: ఈ పరీక్షకు అవసరమైన డాక్యుమెంట్లతోపాటు ఫొటోలు, సంతకాన్ని ప్రత్యేక ఫార్మెట్‌లో అప్‌లోడ్ చేయాలి.

స్టెప్ 6: అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లింపు ప్రక్రియ ఉంటుంది.


స్టెప్ 7: ఆ తర్వాత ఈ దరఖాస్తును సబ్మిట్ చేయాలి. అలాగే ఆ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ 8: భవిష్యత్తు అవసరాల కోసం ఈ పేజీని సేవ్ చేసి, ప్రింట్ తీసుకోవాలి.

Updated Date - May 28 , 2026 | 07:25 PM