Share News

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..

ABN , Publish Date - May 30 , 2026 | 07:17 AM

మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇరాన్ అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించారు.

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..
Ayatollah Ali Khamenei Funeral

మాజీ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇరాన్ అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఖమేనీకి అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది (Khamenei Funeral).


మూడు దశాబ్దాలకు పైగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా కొనసాగిన ఖమేనీ, ఫిబ్రవరి 28న జరిగిన తొలి దాడుల్లో మరణించారు. అయితే దేశంలో కొనసాగిన యుద్ధ పరిస్థితుల కారణంగా అంత్యక్రియలు పలుసార్లు వాయిదా పడ్డాయి. ఇప్పుడు యుద్ధ పరిస్థితులు కొంతవరకు చల్లారడంతో, అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు (Tehran Funeral Ceremony).


'అంత్యక్రియల కార్యక్రమానికి సన్నాహాలు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు (US Israel Iran Conflict). వివిధ ఏజెన్సీలు ప్రస్తుతం ప్రణాళికలు రచిస్తూ, ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారు' అని టెహ్రాన్ కో-ఆర్డినేషన్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ప్రొపగాండా అధిపతి మోహ్సెన్ మహమూదిని ఉటంకిస్తూ ప్రభుత్వ టీవీ నివేదించింది.


Also Read:

ప్రతి 10 మందిలో 7 మందికి ఫైబర్ లోపం.. షాకింగ్ రిపోర్ట్

తెలంగాణ రైతుల కృషితోనే ఈ అగ్రస్థానం: మంత్రి తుమ్మల

Updated Date - May 30 , 2026 | 07:17 AM