అమెరికా డిమాండ్లు నెరవేరాల్సిందే.. ఇరాన్‌తో ఒప్పందంపై సంతకం చేయని ట్రంప్..
ABN , Publish Date - May 30 , 2026 | 09:55 AM
ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది ఆమోదం తెలపలేదు. ఇరాన్‌తో ఘర్షణ ముగించే ఒప్పందంపై ఆయన ఇంకా సంతకం చేయలేదు. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అమెరికా నిర్దేశించిన కీలక షరతులకు అనుగుణంగా ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌తో ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది ఆమోదం తెలపలేదు. ఇరాన్‌తో ఘర్షణ ముగించే ఒప్పందంపై ఆయన ఇంకా సంతకం చేయలేదు. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అమెరికా నిర్దేశించిన కీలక షరతులకు అనుగుణంగా ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసేలా కనబడడం లేదు (US Iran Deal).
ఇరాన్‌తో ఒప్పందంపై చర్చించేందుకు, తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ (Donald Trump) వైట్‌హౌస్ సిచ్యువేషన్ రూమ్‌లో తన సలహాదారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు జరిగింది. అయినప్పటికీ ఆ ఒప్పందంపై ట్రంప్ ఇప్పటివరకు అధికారికంగా సంతకం చేయడం గానీ, తుది ఆమోదం ప్రకటించడం గానీ జరగలేదు. ఈ డీల్‌పై సంతకం చేయకుండానే ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన కొన్ని నిబంధనలపై ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది (Iran Nuclear Deal). ముఖ్యంగా యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవాలనే అమెరికా డిమాండ్‌కు ఇరాన్ పూర్తిగా అంగీకరించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ డీల్‌పై పూర్తి సంతృప్తిగా లేరట. ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా అది అమెరికాకు మేలు చేసిదిగా ఉండాలని, అధ్యక్షుడు ట్రంప్‌ను సంతృప్తిపరచాలని, అప్పుడే ఆయన తుది ఆమోదం తెలుపుతారని వైట్‌హౌస్ అధికారి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే