ఫైనల్ చేరలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్..
ABN , Publish Date - May 30 , 2026 | 08:51 AM
తాజా ఐపీఎల్‌లో పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందర్నీ ఆకట్టుకున్నాడు. అద్వితీయమైన ప్రతిభతో ఆద్యంతం రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్ఆర్ ఇంటిదారి పట్టింది.
తాజా ఐపీఎల్‌లో పదిహేనేళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అందర్నీ ఆకట్టుకున్నాడు. అద్వితీయమైన ప్రతిభతో ఆద్యంతం రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆర్ఆర్ ఇంటిదారి పట్టింది. తన జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోవడంతో వైభవ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు (Vaibhav Sooryavanshi Breaks Down).
శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓటమి అనంతరం వైభవ్ మైదానంలోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. డగౌట్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు అతడిని ఓదార్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీజన్ మొత్తం అద్భుతంగా రాణించి సత్తా చాటిన ఈ పదిహేనేళ్ల కుర్రాడు కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేసింది (RR vs GT).
ఈ సీజన్ మొత్తం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది (Vaibhav Sooryavanshi Crying). వైభవ్ మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 776 పరుగులు చేసి, పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో 700కు పైగా పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కూడా వైభవ్ 47 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లతో 96 పరుగులు చేశాడు.
ఇవి కూడా చదవండి..
మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే