Share News

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం..

ABN , Publish Date - May 30 , 2026 | 08:25 AM

భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.

జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం..
Yashasvi Jaiswal

భారత వన్డే జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)కు చోటు కల్పించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా 39 ఏళ్ల రోహిత్ శర్మను కొనసాగిస్తూ యువ ఆటగాడిని పక్కన పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.


'రోహిత్ శర్మను తప్పనిసరిగా ఎంపిక చేయాల్సి వచ్చినపుడు, ముందుగా యశస్వి జైస్వాల్‌కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి. అతడికి స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉంది. తన చివరి వన్డే ఇన్నింగ్స్‌లో అజేయ శతకం సాధించిన జైస్వాల్‌ను జట్టులోకి తీసుకోకపోవడం అర్థం లేనిది. రోహిత్ శర్మ వయసు, ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్‌ ప్రకారం అతడికి జట్టులో చోటు దక్కకూడదు' అని మంజ్రేకర్ పేర్కొన్నారు (India ODI Squad).


2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని వన్డే జట్టును బలోపేతం చేయాలంటే జైస్వాల్, సాయి సుదర్శన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సంజయ్ సూచించారు (Indian Cricket Team). జైస్వాల్ ఇప్పటికే అత్యున్నత స్థాయిలో తన ప్రతిభను నిరూపించుకున్నాడన్నారు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు.


ఇవి కూడా చదవండి..

మాజీ సుప్రీం లీడర్ ఖమేనీకి అంత్యక్రియలు.. భారీ ఏర్పాట్లు చేస్తున్న ఇరాన్..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే

Updated Date - May 30 , 2026 | 08:46 AM