పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ABN , Publish Date - Jun 01 , 2026 | 11:42 AM
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు.
విజయనగరం, జూన్ 1: ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం గంట్యాడ మండలం గింజేరులో కూటమి నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 62,34,445 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2728 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు.
కొత్తగా జూన్ నుంచి 5606 స్పాజ్ పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. ఈ లబ్ధిదారులకు ప్రత్యేకంగా రూ.2.24 కోట్లు విడుదల చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ.65,886.57 కోట్లు విడుదల చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రితో పాటు పెన్షన్ల పంపిణీలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకురాలు బగ్గు అర్చన పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
Read Latest AP News And Telugu News