వైభవ్ ఊచకోత.. రాజస్థాన్ స్కోర్ 243/6
ABN , Publish Date - May 27 , 2026 | 09:25 PM
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
స్పోర్స్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ(97*) చెలరేగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి వచ్చిరావడంతోనే హైదరాబాద్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్.. 29 బంతుల్లో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో 7 ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి.. పెవిలియన్ చేరాడు.
మిగిలిన బ్యాటర్లలో ధ్రువ్ జురేల్(21 బంతుల్లో 50 పరుగులు) కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. జైస్వాల్ 29 బంతుల్లో 29 పరుగులు , రవీంద్ర జడేజా 9 బంతుల్లో 12 పరుగులు, ఫెరీరా 9 బంతుల్లో 12 పరుగులు, కెప్టెన్ రియాన్ పరాగ్ 12 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే మూడు వికెట్లు తీసి.. రాజస్థాన్ బ్యాటర్ల విధ్వంసానికి కాస్తా బ్రేకులు వేశాడు. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్, నితీశ్ కుమార్ రెడ్డి తలో వికెట్ సాధించారు. వైభవ్ సూర్యవంశీ తన మార్క్ ఆటతో రాజస్థాన్‌కు శుభారంభమిచ్చి ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల(61*) వీరుడిగా వైభవ్ అవతరించాడు. 2012లో వెటరన్ క్రిస్ గేల్ 59 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ యువ సంచలనం బద్దలు కొట్టింది. మొత్తంగా ఎస్ఆర్‌హెచ్ ముందు 244 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ నిర్ధేశించింది.
ఇవి కూడా చదవండి:
నాలుగేళ్లలో ఏ ఆటగాడూ ఇంతగా మెరుగుపడలేదు: అంబటి రాయుడు
సినిమాను మించిన ట్విస్టులతో సాగిన స్టార్ క్రికెటర్ లవ్ స్టోరీ!