Share News

‘కరుప్పు’ సినిమా పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - May 27 , 2026 | 08:32 PM

‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని ధర్మాసనం అభిప్రాయపడింది.

‘కరుప్పు’ సినిమా పిటిషన్ కొట్టివేత
Madras High Court

ఢిల్లీ: ‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. కోర్టుల్లో అవినీతిని చూపించారనే కారణంతో సినిమాను నిషేధించలేమని పేర్కొంది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని ఎవరూ పూర్తిగా ఖండించలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 'న్యాయమూర్తులు దేవుళ్లు కారు.. వ్యవస్థాగత విమర్శలకు ఎవరూ అతీతులు కాదు' అని కోర్టు స్పష్టం చేసింది. కళాత్మక స్వేచ్ఛకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.


గతంలోనూ అవినీతి జడ్జిలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పుడు పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు ఫుల్ కోర్టు పేర్కొంది. సినిమాలో చూపించిన కోర్టు పూర్తిగా ఊహాజనితమని, అందువల్ల దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమాల్లో విషయాలను అతిశయోక్తిగా చూపించడం సహజమని, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది.


ఈ వార్తలనూ చదవండి:

కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం! ప్రైవేటు రంగానికి ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేసే ఛాన్స్

ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం విజయ్

Updated Date - May 27 , 2026 | 08:59 PM