Share News

ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం విజయ్

ABN , Publish Date - May 27 , 2026 | 05:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ఢిల్లీలో తొలిసారి జరుపుతున్న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారంనాడు కలుసుకున్నారు. ఉభయులూ 25 నిమిషాల సేపు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి మోదీని కలిసిన సీఎం విజయ్
Vijay meets PM Modi

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ (C Joseph Vijay) ఢిల్లీలో తొలిసారి జరుపుతున్న అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సేవతీర్ధ్‌లో బుధవారంనాడు కలుసుకున్నారు. ఉభయులూ 25 నిమిషాల సేపు సమావేశమయ్యారు. చోళుల కాలం నాటి రాగి శాసననాలకు పోలెండ్ నుంచి భారతదేశానికి రప్పించినందుకు మోదీకి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక ప్రకటించిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టు, దిగువ ప్రాంతాలపై దాని ప్రభావాన్ని విజయ్ ప్రధాని దృష్టికి వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుగా రాష్ట్ర గీతం పాడేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

అనంతరం విజయ్ నేరుగా తమిళనాడు హౌస్‌కు చేరుకోవడంతో గౌరవ వందనంతో ఆయనకు సాదర స్వాగతం లభించింది. తమిళనాడు సీఎంగా విజయ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఢిల్లీకి రావడం ఇదే ప్రథమం.


విజయ్ తన పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలుసుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను 10 జన్‌పథ్‌లో కలుసుకోనున్నారు. విజయ్ సమావేశం నేపథ్యంలో జన్‌పథ్ వెలుపల రాహుల్-విజయ్ ఫోస్టర్లు వెలిసాయి. కాగా, వామపక్షాలు, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీల నేతలు కూడా తమిళనాడు హౌస్‌లో విజయ్‌ను కలుసుకోనున్నారు.


ఇవి కూడా చదవండి..

బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు

ఈడీ రెయిడ్స్‌.. కేరళం మాజీ సీఎం తీవ్ర ఆగ్రహం

Updated Date - May 27 , 2026 | 06:25 PM