Home » Tamil Nadu CM
ఆసియా క్రీడలు-2026లో రజత పతకం సాధించిన తమిళనాడుకు చెందిన స్క్వాష్ అథ్లెట్ అభయ్ సింగ్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు.
అసెంబ్లీ ప్రసంగంలో సీఎం విజయ్ తన కుడిచేతితో గడ్టాన్ని పైకి లేపేట్టుగా చేసిన హావభావంపై ప్రతిపక్ష డీఎంకే మండిపడుతోంది. దీనిపై దుమారం రేగడంతో అది అనుకోకుండా వచ్చిన 'బాడీ లాంగ్వేజ్' అని విజయ్ వివరణ ఇచ్చారు.
తమిళనాడులో సీఎం సి.విజయ్ నేతృత్వంలోని కూటమికి అధికారికంగా ఎస్ఎస్‌జేవీఏ అనే పేరు ఖరారైంది. మొత్తం 5 పార్టీలు ఇందులో భాగమయ్యాయి.
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నై నగరాన్ని ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్.
నేపాల్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళనాడు వాసుల్లో 50 మందికిపైగా చిక్కుకుపోయినట్లు సమాచారం.
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అగ్రనేత కరుణానిధిని తమిళనాడు అసెంబ్లీలో గౌరవపూర్వకంగా సంబోధించకపోవడం వివాదానికి దారితీసింది.
లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వాళ్తు'ను తప్పనిసరిగా ఆలపించేలా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది
తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను సంగీత ఉపసంహరించుకున్నారు.