రాహుల్ గాంధీతో విజయ్ భేటీ.. కేఫ్‌లో కాఫీ, తిరమిసు.. అభిమానులతో సెల్ఫీలు..
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:34 PM
కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తాజా భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసంలో సుమారు గంటపాటు ఇద్దరూ చర్చలు జరిపారు.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తాజా భేటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసంలో సుమారు గంటపాటు ఇద్దరూ చర్చలు జరిపారు. అనంతరం సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లి కాఫీ, తిరమిసు, కుకీలు ఆస్వాదించారు. రాజకీయ చర్చలతో ప్రారంభమైన ఈ భేటీ.. ఆత్మీయ పలకరింపులు, అభిమానులతో సెల్ఫీలతో ప్రత్యేకంగా నిలిచింది (Rahul Gandhi Vijay meeting).
విద్యార్థులతో సమావేశంలో పాల్గొనేందుకు శనివారం చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ.. ముందుగా ముఖ్యమంత్రి విజయ్ నివాసానికి వెళ్లారు. నీలాంకరైలోని తన ఇంటి వద్ద విజయ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు సుమారు గంటపాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో వీరిద్దరూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్-టీవీకే మధ్య సమన్వయం, భవిష్యత్తు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇంటి వద్ద సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ, విజయ్ సమీపంలోని ఓ కేఫ్‌కు వెళ్లారు (Rahul Gandhi Chennai visit).
కేఫ్‌లో ఈ ఇద్దరూ కాపుచినో, తిరమిసు, కుకీలు ఆర్డర్ చేసి ఆస్వాదించారు (Rahul Vijay coffee outing). ఇద్దరు నేతలు ఒకేచోట కనిపించడంతో కేఫ్‌లో ఉన్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు అభిమానులు వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ, విజయ్ కూడా అక్కడి వారితో ముచ్చటించారు. సెల్ఫీలు దిగారు. సాధారణ రాజకీయ సమావేశాలకు భిన్నంగా సాగిన ఈ కేఫ్ సందర్శన.. ఇద్దరు నేతల మధ్య సాన్నిహిత్యాన్ని చాటింది.
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి