Share News

నిరసనలో పాల్గొన్న మమత, కేజ్రీవాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:26 PM

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

నిరసనలో పాల్గొన్న మమత, కేజ్రీవాల్‌.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Mamata Banerjee detained

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు (Mamata Banerjee detained).


ఢిల్లీలోని సౌత్ అవెన్యూ ప్రాంతంలో మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ నోటికి బ్యాండేజ్ అంటించుకుని నిరసన తెలిపారు. పోలీసులు తమను బస్సులో తరలిస్తున్న సమయంలో మమతా బెనర్జీ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రభుత్వం తమతో అనుచితంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజల గొంతుకను బలోపేతం చేసేందుకు ఇండియా కూటమి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు (CJP Delhi protest).


ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ నివాసం చుట్టూ ఉదయం నుంచే పోలీసులు మోహరించారు (Jantar Mantar protest). నిరసనలో పాల్గొనేందుకు బయటకు వచ్చినప్పుడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియానికి తరలించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు పలు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.


ఇవి కూడా చదవండి..

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..


ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి

Updated Date - Oct 10 , 2026 | 04:29 PM