ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:47 PM
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై ఆయన తల్లి అనితా దీప్కే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని విమానంలో నుంచి అదుపులోకి తీసుకున్న విధానం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు (Abhijeet Dipke mother).
తనను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అభిజిత్‌కు ముందే తెలుసని అనిత చెప్పారు. ఈ రోజు టీవీ చూడొద్దని, మొబైల్ ఫోన్ కూడా చూడొద్దని తనకు అభిజిత్ చెప్పినట్లు తెలిపారు. అయితే, అభిజిత్ అరెస్ట్ గురించి తెలిశాక ఫోన్ చూడకుండా ఉండలేకపోయానన్నారు. విమానం లోపలికి పోలీసులు వచ్చి అభిజిత్‌ను అదుపులోకి తీసుకున్న తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తెలిపారు. విమానంలోనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని అనితా దీప్కే అభిప్రాయపడ్డారు (Abhijeet Dipke Arrest).
తన కుమారుడు చేసిన తప్పేంటని ఆమె ప్రశ్నించారు. అతడికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అనితా దీప్కే వ్యాఖ్యానించారు (CJP protest). రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారని, వారిని అదుపులోకి తీసుకోకుండా తన కుమారుడి విషయంలో మాత్రం పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయంపై ఆయన తండ్రి భగవాన్‌రావ్ దీప్కే కూడా స్పందించారు. తన కుమారుడికి, అతడి స్నేహితులకు ప్రజల మద్దతు ఉంటుందని, వారు తమ పోరాటాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు