Share News

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:22 AM

రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో కొన్ని సవరణలు చేస్తూ నైపుణ్యాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ సర్వీస్‌ రూల్స్‌లో కొన్ని సవరణలు చేస్తూ నైపుణ్యాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఉపాధి కల్పన), ప్రాంతీయ ఉపాధి కల్పన అధికారి, యూనివర్సిటీ ఉపాధి కల్పన డిప్యూటీ చీఫ్‌ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఉపాధి కల్పన అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఉపాధి కల్పన అధికారి(ఒకేషనల్‌ గైడెన్స్‌) పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ సర్వీస్‌ ద్వారా భర్తీ చేస్తారు. జూనియర్‌ ఉపాధి కల్పన అధికారి పోస్టులను కూడా అలాగే భర్తీ చేస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 06:22 AM