Share News

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:53 PM

ప్రకృతి విపత్తులు ప్రజల జీవితాలనే కాదు.. కొన్నిసార్లు రాజకీయ నాయకుల భవిష్యత్తును కూడా మార్చేస్తాయి. కొందరు పదవులు కోల్పోతారు.. మరికొందరు ఆ విపత్తు నుంచే ఎదుగుతారు. గుజరాత్‌లో 2001 జనవరి 26న సంభవించిన భుజ్ భూకంపం అలాంటి ఘటనే.

భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
Modi 25 years in government

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి విపత్తులు ప్రజల జీవితాలనే కాదు.. కొన్నిసార్లు రాజకీయ నాయకుల భవిష్యత్తును కూడా మార్చేస్తాయి. కొందరు పదవులు కోల్పోతారు.. మరికొందరు ఆ విపత్తు నుంచే ఎదుగుతారు. గుజరాత్‌లో 2001 జనవరి 26న సంభవించిన భుజ్ భూకంపం అలాంటి ఘటనే. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విపత్తు, గుజరాత్ పునర్నిర్మాణానికి పెద్ద సవాలుగా మారింది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అప్పటికి భారతీయ జనతా పార్టీ కీలక నేతగా ఉన్న నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ భూకంపం వల్ల లభించింది (Bhuj earthquake 2001).


2001 జనవరి 26న గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. భుజ్‌తో పాటు అనేక ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. వేలాది మంది మరణించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇళ్లు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు, బాధితులకు పునరావాసం కల్పించడం అప్పటి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. భూకంపం తర్వాతి సహాయక చర్యల నిర్వహణ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ గుజరాత్‌లో నాయకత్వ మార్పుపై దృష్టి సారించింది (Modi 25 years in government).


భారతీయ జనతా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మోదీని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. 2001 అక్టోబర్ 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ పునర్నిర్మాణ పనులను వేగవంతం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పునర్నిర్మాణ నిర్ణయాలను, పనులను స్వయంగా పర్యవేక్షించారు. ఆ తర్వాత గుజరాత్‌లోని మౌలిక వసతులను నెలకొల్పడంపై దృష్టి సారించారు (Gujarat Chief Minister history).


భుజ్ భూకంపాన్ని మోదీ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా పేర్కొనవచ్చు. 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ అప్పట్నుంచి అధికారంలోనే ఉంటూ వస్తున్నారు. 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత ప్రధానమంత్రిగా సేవలందిస్తున్నారు. 2026 అక్టోబర్ 7తో ఆయన ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి...

వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం

‘సర్’పై కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టండి.. నేతలకు రాంచందర్ రావు పిలుపు

Updated Date - Oct 10 , 2026 | 03:58 PM