వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం
ABN , Publish Date - Oct 10 , 2026 | 09:47 AM
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఊరి శివారు బావిలో దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడింది.
వికారాబాద్ జిల్లా, అక్టోబర్ 10: జిల్లాలోని పరిగి మండలం రావులపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఊరి శివారు బావిలో దూకి ఆమె బలవన్మరణానికి పాల్పడింది. అయితే చరణ్ అనే యువకుడు.. యువతికి ఫోన్ చేసి వేధించడం వల్లే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న(శుక్రవారం) సాయంత్రం నుంచి బయటకు రావాలంటూ యువతికి చరణ్ పదే పదే ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేకే ఆమె ప్రాణాలు తీసుకుందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈతగాళ్ల సాయంతో యువతి మృతదేహాన్ని బాలిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి...
తూ.గో. జిల్లాలో పెద్దపులి సంచారం.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరిక
కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా
Read Latest Telangana News And Telugu News