Share News

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:52 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన
rain alert

అమరావతి, అక్టోబర్ 10: తిరోగమన రుతుపవన కాలం నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 14 నాటికి వాయుగుండంగా ఏర్పడడానికి అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు - దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించే అవకాశాలున్నాయని.. దీని ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రాత్రి వేళల్లో రోడ్లపై బర్త్‌ డే పార్టీలొద్దు!
పౌరసరఫరాల శాఖ మహబూబాబాద్‌ జిల్లా మేనేజర్‌కు 100 కోట్ల ఆస్తులు!

నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 10 , 2026 | 09:28 AM