నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్
ABN , Publish Date - Oct 07 , 2026 | 10:33 AM
రోగులకు మెరుగైన సమన్వయం, తక్షణ మార్గదర్శకత్వం, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు నిమ్స్ ఆసుపత్రిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
సేవలకు వైద్యాధికారుల నియామకం
హైదరాబాద్ సిటీ: రోగులకు మెరుగైన సమన్వయం, తక్షణ మార్గదర్శకత్వం, సకాలంలో వైద్య సేవలు అందించేందుకు నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
అటు రోగులు, ఇటు ప్రజాప్రతినిధులకు వైద్య సేవలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అధికారులు ఉంటారు. రోగి ఎదుర్కొనే సమస్యను ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్తే వెంటనే సంబంధిత విభాగంతో సంప్రదింపులు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వారి వ్యక్తిగత
కార్యదర్శులు, వ్యక్తిగత
సహాయకులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. ప్రత్యేక హెల్ప్‌లైన్ సేవల కోసం నలుగురు అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్లు, వీరిని పర్యవేక్షించడానికి అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్‌ను నియమించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
రోగులు, ప్రజాప్రతినిధులు తమ ఇబ్బందులకు 24 గంటల పాటు సంప్రందించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించారు. నిమ్స్ హాట్‌లైన్-040-23489692. డ్యూటీ మొబైల్- 9490296073, డైరెక్టర్ డ్యూటీ మొబైల్-9490076060 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎన్. రాకేష్ ఫోన్ నంబర్ 9490295048, డాక్టర్ ఎం. చరణ్‌రాజ్ 9490295057, డాక్టర్ సయ్యద్ సల్మాన్ 9398979541, డాక్టర్ పుష్పిరాణి 6305808940 ద్వారా సంప్రందించవచ్చు. ఈ ప్రత్యేక సమన్వయ వ్యవస్థను అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కాశిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి-9490295004 పర్యవేక్షిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News