Share News

దసరాకు గ్రేటర్‌ నుంచి ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 07 , 2026 | 09:25 AM

దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే ప్రజల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నదని సంస్థ ఈడీ శ్రీధర్‌ తెలిపారు.

దసరాకు గ్రేటర్‌ నుంచి ప్రత్యేక బస్సులు
Dussehra Special Buses

  • 30 మంది ఉంటే.. ఉన్నచోటుకే ఆర్టీసీ సర్వీసులు

హైదరాబాద్‌ సిటీ: దసరా పండుగ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే ప్రజల కోసం టీజీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నదని సంస్థ ఈడీ శ్రీధర్‌ తెలిపారు. వివిధ కళాశాలల్లో చదువుతూ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల సౌకర్యార్థం వారు నివసించే హాస్టల్‌ ప్రాంతాలు, కళాశాలల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.


city4.3.jpg30 మంది ప్రయాణికులుంటే కాలనీలు, టౌన్‌షి్‌పలు, గేటెడ్‌ కమ్యూనిటీలకు ఆర్టీసీ నేరుగా స్పెషల్‌ సర్వీసులను పంపిస్తారు. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట, కోదాడ, భద్రాచలం, ఖమ్మం, ఆర్మూర్‌కు బస్సులు కావాల్సిన వారు డివిజనల్‌ డిప్యూటీ రీజనల్‌ మేనేజర్లను సంప్రదించవచ్చన్నారు.


కళాశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు ముందస్తుగా బస్సులు బుక్‌ చేసుకోవచ్చన్నారు. బస్సుల వివరాల కోసం జూబ్లీబ్‌సస్టేషన్‌ (జేబీఎస్‌) జోనల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ను 9959226160 నంబరులో సంప్రదించాలన్నారు.

city3.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 09:38 AM