Share News

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 07:37 AM

దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం రాత్రి ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ కేంద్రంగా సంభవించిన భూప్రకంపనలు ఢిల్లీని వణికించాయి.

ఢిల్లీని కుదిపేసిన భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
Delhi earthquake

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. రాత్రి సుమారు 10:20 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌లోని చమోలీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.9గా నమోదైనట్లు సమాచారం. ఈ ప్రకంపనలు ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లోనూ స్పష్టంగా కనిపించినట్టు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.


భూకంపం సంభవించిన కొద్దిసేపటి తర్వాత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం రాత్రి సుమారు 10:40 గంటలకు దీనిపై నిర్ధారణ వెలువరించింది. ఢిల్లీతో పాటు హరియాణా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించినట్టు తెలుస్తోంది. అయితే.. ప్రకంపనలతో ఎలాంటి నష్టం వాటిల్లిందన్న సమాచారం ప్రస్తుతానికి తెలియరాలేదు. భూకంప కేంద్రం చమోలీ ప్రాంతంలో ఉండటంతో అక్కడి పరిస్థితులపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 07 , 2026 | 07:52 AM