సికింద్రాబాద్-కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Oct 07 , 2026 | 08:10 AM
దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- కాకినాడ మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ సిటీ: దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్- కాకినాడ మధ్య రెండు ప్రత్యేకరైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. 07817 ప్రత్యేకరైలు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.25 గంటలకు, 07818 ప్రత్యేకరైలు ఈ నెల 10న కాకినాడ నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్ పేర్కొన్నారు.
మార్గమధ్యంలో ప్రత్యేకరైళ్లకు చర్లపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్లలో హాల్ట్ ఉంటుందని ఆయన వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 10 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News