టీ20ల్లో మెయిడెన్ సెంచరీ.. నా కల నిజమైంది: శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Oct 07 , 2026 | 06:59 AM
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(102*) అజేయ సెంచరీతో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం తన మెయిడెన్ సెంచరీ, జట్టు విజయంపై అయ్యర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(102*) అజేయ సెంచరీతో చెలరేగాడు. ఆసియా గేమ్స్ తర్వాత భారత జట్టు ఆడిన తొలి టీ20 ఇదే. జపాన్ నుంచి నేరుగా రావడం, ప్రయాణం, అలసట.. ఇవన్నీ ఉన్నప్పటికీ టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తన మెయిడెన్ సెంచరీ, జట్టు విజయంపై శ్రేయస్ అయ్యర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు. ప్రతిరోజూ ఇలాగే ఉదయిస్తే ఎంత బాగుంటుంది కదా! అయితే మేము ప్రయాణాలు, అలసటను సాకుగా చూపాలని అనుకోలేదు. తొలుత బౌలింగ్ చేయడం మాకు కలిసొచ్చింది. వన్డేల్లో భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌లకు లభించిన ఆదరణ, ఉత్సాహాన్ని చూశాం. అదే ఊపులో మా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టి.. ప్రణాళికలన్నీ పక్కాగా అమలు చేశాం. ఫలితం అనుకూలంగా వచ్చింది. నా తొలి శతకం గురించి ఇంకా ఆలోచిస్తున్నాను. కలలు కనాలి.. వాటి సాకారం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈరోజు నా కల నిజమైంది. మొత్తంగా ఇది జట్టు సమష్టి ప్రదర్శన. ఇదే ఆలోచనా విధానాన్ని కొనసాగిస్తే టీ20 క్రికెట్‌లో అత్యంత విధ్వంసకర జట్లలో ఒకటిగా మారతాం’ అని అయ్యర్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన