Share News

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:23 AM

టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా మారారు. టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల షేర్ల విలువ ఇటీవల పెరగడంతో సోమవారం మస్క్ నికర సంపద 65 బలియన్ డాలర్ల మేర పెరిగి 1.04 ట్రిలియన్‌లకు చేరుకుంది.

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్
Elon Musk Trillionaire

ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి ట్రిలియనీర్‌గా మారారు. టెస్లా స్పేస్ ఎక్స్ సంస్థల షేర్ల విలువ ఇటీవల పెరగడంతో సోమవారం మస్క్ నికర సంపద 65 బలియన్ డాలర్ల మేర పెరిగి 1.04 ట్రిలియన్‌లకు చేరుకుంది. ఈ నెల ప్రారంభం నుంచి నేటి వరకూ స్పేస్ ఎక్స్ సంస్థ షేరు విలువ 13 శాతం మేర పెరగ్గా టెస్లా షేరు ధర కూడా 6.7 శాతం మేర ఎగబాకింది. ఈ ఏడాదిలో మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల మార్కు దాటడం ఇది రెండోసారి.


ఈ ఏడాది జూన్‌లో మస్క్ తొలిసారిగా ప్రపంచపు మొట్టమొదటి ట్రిలియనీర్‌గా మారిన విషయం తెలిసిందే. ఐపీఓ నేపథ్యంలో స్పేస్ ఎక్స్ సంస్థ షేర్లు భారీగా పెరగడంతో మస్క్ నికర సంపద విలువ కూడా పెరిగింది. అయితే, సంస్థ మార్కెట్ విలువపై అంచనాలు ఉండవల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు భావిండచంతో షేర్ల అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా మస్క్ నికర సంపద అప్పట్లో ట్రిలియన్ డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది.


ప్రస్తుతం స్పేస్ ఎక్స్, టెస్లా షేర్లపై మదుపర్లు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన రంగంలో విశ్వసనీయ సంస్థగా స్పేస్ ఎక్స్ మారుతున్న నేపథ్యంలో సంస్థ షేర్లకు డిమాండ్ పెరిగింది. మస్క్ సారథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వేదికలు కూడా మంచి పురోగతిని సొంతం చేసుకున్నాయి. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో టెస్లా కార్ల విక్రయాలు అంచనాలను మించిపోయాయి. మస్క్ నికర సంపదలో టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల షేర్ల వాటానే 98 శాతంగా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

దేశీ హాస్పిటల్స్‌పై విదేశీ పాగా

Updated Date - Oct 06 , 2026 | 09:02 AM