Share News

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త!

ABN , Publish Date - Oct 06 , 2026 | 04:23 AM

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి అజ్ఞాత వ్యక్తులందించే టిప్స్‌, ఫిన్‌ఫ్లుయెన్సర్లు, భారీ లాభాల ఆశజూపే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత...

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త!

  • అజ్ఞాత వ్యక్తుల టిప్స్‌, భారీ లాభాల ఆశచూపే వారిని నమ్మి మోసపోవద్దు..

  • జూమదుపరులను హెచ్చరించిన సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే

  • జూప్రాజెక్ట్‌ జాగ్‌రూక్‌ పేరుతో అవగాహన కార్యక్రమం ప్రారంభం

చండీగఢ్‌: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి అజ్ఞాత వ్యక్తులందించే టిప్స్‌, ఫిన్‌ఫ్లుయెన్సర్లు, భారీ లాభాల ఆశజూపే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే సోమవారం హెచ్చరించారు. మార్కెట్‌ మదుపరుల్లో అవగాహన పెంచేందుకు ప్రాజెక్ట్‌ జాగ్‌రూక్‌ పేరుతో దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సెక్యూరిటీస్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య, పెట్టుబడులపై అవగాహన కలిగిన వారి సంఖ్య మధ్య భారీ అంతరం ఉందని తమ సర్వేలో వెల్లడైందన్నారు. ఎవరో సలహా ఇచ్చారని లేదా అందరూ పెట్టుబడులు పెడుతున్నారని మీరు మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయవద్దని సెబీ చైర్మన్‌ సూచించారు. మార్కెట్‌ సాధనాలు, పథకాలను పూర్తిగా అర్ధం చేసుకుని పెట్టుబడులు పెట్టాలన్నారు. పాండే ఇంకా ఏమన్నారంటే..

జూగత దశాబ్దకాలంలో భారత క్యాపిటల్‌ మార్కెట్‌ విస్త్రతం కావడంతో పాటు ప్రవేశం మరింత సులభతరంగా మారింది. అయితే, పెట్టుబడి మోసాలపై జాగ్రత్త. సెబీ నియంత్రిత ఆర్థిక సాధనాలు, మార్గాలు, సంస్థల ద్వారా నే పెట్టుబడులు పెట్టండి. అంతేతప్ప అజ్ఞాత వ్యక్తులు, ఫిన్‌ఫ్లుయెన్సర్ల టిప్స్‌, భారీగా లాభాల ఆశజూపే వారిని గుడ్డిగా నమ్మకండి. మీకు పూర్తి అవగాహన కలిగిన ఆర్థిక సాధనాలు లేదా పథకాల్లోనే పెట్టుబడులు పెట్టండి.

జూమీ జీవితంలో వీలైనంత త్వరగా మదుపు చేయడం ప్రారంభించండి. ఆకర్షణీయ ప్రతిఫలాలు అందుకోవాలంటే ఓపిక అవసరం. అందుకోసం దీర్ఘకాలిక పొదుపు, పెట్టుబడుల వివిధీకరణపై దృష్టిపెట్టండి.

జూమన సెక్యూరిటీస్‌ మార్కెట్‌ గతంలో కంటే ప్రజాస్వామ్యయుతంగా మారడంతో పాటు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కానీ సులభంగా అందుబాటులోకి వస్తే మాత్రం సరిపోదు. మదుపరులకూ ఈ విషయం తెలియాలి. అందుకే మదుపరుల్లో అవగాహన పెంచాలి.

జూబలమైన మార్కెట్లు అంటే కేవలం ట్రేడింగ్‌ ఎక్స్ఛేంజ్‌లు, క్లియరింగ్‌ కార్పొరేషన్లు, డిపాజిటరీలు మాత్రమే కాదు.. పెట్టుబడులపై అవగాహన కలిగిన మదుపరులు కూడా. మదుపరుల్లో అవగాహన పెంచేందుకే ప్రాజెక్ట్‌ జాగ్‌రూక్‌ ప్రారంభించాం. ఇంగ్లీష్‌, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరిజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. టీవీలు, పత్రికలు, రేడియో, సినిమా, ఔట్‌డోర్‌ మీడియా, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌, సోషల్‌ మీడియా, ఓటీటీ, వాట్సా్‌పతో పాటు భౌతిక సంప్రదింపుల ద్వారానూ మదుపుపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తాం.

ఈ వార్తలనూ చదవండి:

త్వరలో GST కౌన్సిల్ భేటీ.. సంచలన సంస్కరణలకు శ్రీకారం!

స్థిరంగా పసిడి ధరలు.. ప్రస్తుతం రేట్స్ ఇవీ

Updated Date - Oct 06 , 2026 | 04:23 AM