ఒలింపిక్స్ ఆతిథ్యానికి గట్టి పోటీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:27 AM
తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. 2036 గేమ్స్ నిర్వహణ కోసం రేసులో...
రేసులో భారత్ సహా ఏడు దేశాలు
ప్రకటించిన ఐఓసీ
లాసాన్నే: తొలిసారిగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న భారత్‌కు గట్టి సవాల్ ఎదురుకానుంది. 2036 గేమ్స్ నిర్వహణ కోసం రేసులో ఉన్న దేశాలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఇందులో భారత్‌తో పాటు ఖతార్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, జర్మనీ, హంగేరి, తుర్కియే కూడా ఉన్నాయి. దేశంలో ఒలింపిక్స్‌ను నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు 2024లోనే భారత్ ప్రతిపాదనలు పంపింది. మరోవైపు 2036 ఆతిథ్య హక్కుల కోసం ఆయా దేశాలు బిడ్డింగ్ వేసేందుకు ఈనెల 31 వరకు గడువుంది. అలాగే వచ్చే నెలలో తమ గేమ్స్ ప్రాజెక్ట్‌లను ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు సమర్పించాల్సిందిగా పోటీలో ఉన్న దేశాలను ఐఓసీ కోరింది. వచ్చే ఏడాది మార్చిలో ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా వీటిని నిశితంగా పరిశీలించనుంది. 2029 మధ్యలో ఆతిథ్య దేశం పేరును ప్రకటిస్తారు. ఇదిలావుండగా అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్‌ను నిర్వహించాలని భారత్ భావిస్తోంది. అయితే ఖతార్ నుంచి మనకు సవాల్ ఎదురుకానుంది. ఇదివరకే వారికి ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌క్‌పను నిర్వహించిన అనుభవం కూడా ఉంది. 1972లో జర్మనీ, 1988లో దక్షిణాఫ్రికా దేశాలు ఇప్పటికే ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చాయి. 2028లో లాస్ ఏంజిల్స్ (అమెరికా), 2032లో బ్రిస్బేన్ (ఆస్ర్టేలియా)లో ఒలింపిక్స్ జరుగనున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలూ చదవండి
విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..
వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య