Share News

విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:54 PM

లఖ్‌నవూలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.

విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..
IND vs WI

లఖ్‌నవూలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ముందు 172 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది (India vs West Indies, 1st T20I).


మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు 44 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (56), షాయ్ హోప్ (52) కీలక పరుగులు చేసి ఆదుకున్నారు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో వెస్టిండీస్‌ను మంచి స్కోరు దిశగా తీసుకెళ్లారు. అయితే మధ్య, చివరి ఓవర్లలో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లు పూర్తికాకముందే ఆలౌటైంది. 19.1 ఓవర్లలో 171 పరుగులు చేసింది (India target 172).


భారత్ తరఫున టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నామన్ ధీర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు (IND vs WI Live). 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు సాధించారు. అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే 172 పరుగులు సాధించాలి. భారత్ తరఫున అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. భారత తుది జట్టులో నామన్ ధీర్‌కు చోటు దక్కింది. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించలేదు.


ఇవి కూడా చదవండి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..


మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 09:00 PM