ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:34 PM
న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్ష ఎంపీల నిరసన కొనసాగుతోంది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌గా బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద విపక్ష ఎంపీల నిరసన కొనసాగుతోంది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌గా బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీనియర్ ఢిల్లీ పోలీసు అధికారులు మాట్లాడారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలు మంగళవారం పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టారు (Rahul Gandhi, Delhi Police).
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లే మార్గంలో నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ ప్రాంతం వద్ద పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. విపక్ష ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసు అధికారులు చర్చలు జరిపారు (ECI protest).
మరోవైపు విపక్ష ఎంపీల పాదయాత్రపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది (INDIA bloc protest). రాజధానిలో అరాచకం సృష్టించి రాహుల్ గాంధీని రీ-లాంఛ్ చేసేందుకు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేస్తున్న మరో ప్రయత్నమే ఇది అని ఆరోపించింది. తమ ఎన్నికల ఓటములపై ఉన్న నిరాశను ఈ యాత్ర ద్వారా వెళ్లగక్కుతున్నారని, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు వాటిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు.
ఈ వార్తలనూ చదవండి:
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్
చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచా సీజ్.. రూ.12 కోట్ల సరుకు స్వాధీనం