Share News

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచా సీజ్.. రూ.12 కోట్ల సరుకు స్వాధీనం

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:17 AM

చెన్నై పోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చేసిన చైనా బాణసంచాను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచా  సీజ్.. రూ.12 కోట్ల సరుకు స్వాధీనం
Chinese Firecrackers

ఇంటర్నెట్ డెస్క్: చెన్నై పోర్టులో అక్రమంగా భారీగా దిగుమతి చేసిన చైనా బాణసంచాను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ డీఆర్‌ఐ జోనల్‌ యూనిట్‌ నుంచి అందిన సమాచారంతో అధికారులు చెన్నై పోర్టులోని పలు కంటైనర్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 కోట్ల విలువైన చైనా పైరోటెక్నిక్‌ బాణసంచా బయటపడింది. స్టేషనరీ, మెడికల్‌ గ్లౌజులు, ప్లాస్టిక్‌ క్లిప్స్‌, హెయిర్‌ బ్యాండ్స్‌, స్టోరేజ్‌ వార్డ్‌రోబ్స్‌, షూ ర్యాక్స్‌ వంటి వస్తువుల పేరుతో సరుకును దిగుమతి చేసినట్లు గుర్తించారు. అయితే ప్రకటించిన సరుకు వెనుక ఉన్న కార్టన్లలో చైనా బాణసంచాను దాచినట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. దీంతో భారీ మొత్తంలో బాణసంచాను స్వాధీనం చేసుకుని తదుపరి దర్యాప్తు చేపట్టారు.


నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి లైసెన్సులు, అనుమతులు లేకుండానే ఈ బాణసంచాను దిగుమతి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటువంటి పైరోటెక్నిక్‌ సరుకుల దిగుమతికి డీజీఎఫ్‌టీ, పీఈఎస్‌ఓ అనుమతులు తప్పనిసరిగా ఉండటంతో పాటు ఎక్స్‌ప్లోసివ్స్‌ రూల్స్‌-2008 ప్రకారం నిర్దిష్ట నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే తప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వడం, అసలు సరుకును దాచిపెట్టి ఇతర వస్తువుల పేరుతో దిగుమతి చేయడం ద్వారా అక్రమంగా సరుకును తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్‌ యాక్ట్‌-1962 కింద బాణసంచాను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ.. ఈ అక్రమ దిగుమతుల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలు, సరఫరా వ్యవస్థపై దర్యాప్తు కొనసాగిస్తోంది. స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌లను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా, చర్యలు కొనసాగుతున్నాయని డీఆర్‌ఐ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..

మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..

Updated Date - Oct 06 , 2026 | 11:28 AM