Share News

భారత వాయుసేనకు కొత్త అధిపతి.. ఆశుతోష్ దీక్షిత్ నియామకం..

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:28 PM

భారత వాయుసేనకు కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేన వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆయన.. అక్టోబర్ 31, 2026 నుంచి 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత వాయుసేనకు కొత్త అధిపతి.. ఆశుతోష్ దీక్షిత్ నియామకం..
Ashutosh Dixit

ఇంటర్నెట్ డెస్క్: భారత వాయుసేనకు కొత్త అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం వాయుసేన వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆయన.. అక్టోబర్ 31, 2026 నుంచి 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అదే రోజున పదవీ విరమణ చేయనున్నారు (Indian Air Force Chief).


ఆశుతోష్ దీక్షిత్ 1986 డిసెంబర్ 6న భారత వాయుసేన ఫైటర్ స్ట్రీమ్‌లో చేరారు. దాదాపు నాలుగు దశాబ్దాల సర్వీసులో ఆయనకు 3,500 గంటలకు పైగా విమానాలను నడిపిన అనుభవం ఉంది. మిరాజ్-2000, మిగ్ వేరియంట్లు, జాగ్వార్, హాక్, ఐఎల్-78, తేజస్ తదితర విమానాలను నడిపారు. ఆయన ఎక్స్‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్‌తో పాటు క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా సేవలందించారు. ఆశుతోష్ దీక్షిత్ గతంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా, అలాగే సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు (Ashutosh Dixit Chief of Air Staff).


ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా కొనసాగుతున్నారు (Indian Air Force new chief). ఆయన ఆపరేషన్ సఫేద్ సాగర్, ఆపరేషన్ రక్షక్, ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. ఆశుతోష్ దీక్షిత్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఆయనకు పీవీఎస్ఎం, ఏవీఎస్ఎం, వీఎం, వీఎస్ఎం వంటి పతకాలు లభించాయి.


ఇవి కూడా చదవండి..

ఈసీ కార్యాలయం వద్ద విపక్షాల ధర్నా.. రాహుల్ గాంధీతో సీనియర్ పోలీసుల చర్చ..


మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని

Updated Date - Oct 06 , 2026 | 08:40 PM